మహిళ భద్రత చట్టపరమైన హక్కులుపై అవగాహన.


 మహిళ భద్రత చట్టపరమైన హక్కులుపై అవగాహన.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూన్:06

మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల భద్రత మరియు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు చోడవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో "క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్" కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. అప్పలరాజు  ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, మోసాలు వంటి అంశాలపై వివరించి, ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

అలాగే మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన వివిధ సేవలు, అత్యవసర సహాయ నంబర్ 112, మహిళల భద్రతకు సంబంధించిన హెల్ప్‌లైన్ సేవలు మరియు చట్టపరమైన రక్షణల గురించి వివరించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు రావాలని, ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post