" సూపర్ నారి" గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా ఇంచార్చ్ మంత్రి నాదెండ్ల మనోహర్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, జూన్ 05: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం సెర్ఫ్- జిల్లా గ్రామీణ అభివృద్ధిసంస్థ ఆధ్వర్యంలో "మహిళా సాధికారత సమృద్ధి సమాజానికి పునాది, మనడబ్బులు - మన లెక్కలు సూపర్ నారి" జిల్లా ఇంచార్చ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గోడపత్రికలను ఆవిష్కరించారు. జిల్లా ఇంచార్చ్ మంత్రితో పాటు రాజ్యసభ సభ్యులు పాకా వెంకటనారాయణ, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు బడేటి రాధా కృష్ణయ్య (చంటి), సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్,చింతమనేని ప్రభాకర్ లు పాల్గొన్నారు.
జిల్లా ఇంచార్చ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళలు అభివృద్ధి కుటుంబాలు పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలుపై పూర్తి అవగాహన కలిగి ఉండటం, ఆదాయం- వ్యయాలు లెక్కలను సక్రమంగా నిర్వహించడం ద్వారా కుటుంబ ఆర్థికస్థితి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.“మన డబ్బులు - మన లెక్కలు సూపర్ నారి” కార్యక్రమం మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలుపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపి వడ్డీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
