ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
విజయవాడ, జూన్ 06:
దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని - రేపటి నుండి (జూన్ 07 నుండి జూన్ 21 వరకు) 14 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ తెలిపారు.
కార్యక్రమ వివరాలు:
సమయం & వేదిక:
జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 7:00 గంటల నుండి 8:00 గంటల వరకు ఇంద్రకీలాద్రి పైనున్న మహా మండపం 6వ అంతస్తులో ఈ యోగా శిక్షణ జరుగుతుంది.
నిపుణులచే శిక్షణ:
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అర్హులైన యోగా శిక్షకులను (Yoga Instructors) రప్పించి, వారి ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో యోగాసనాలు, ప్రాణాయామం వంటివి నేర్పించనున్నారు.
భక్తులకు ఉచిత ప్రసాదం – రిజిస్ట్రేషన్:
ఈ యోగా శిక్షణకు విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వివరాలను విభాగం నమోదు చేయనుంది. ప్రతీ రోజు యోగా సాధన అనంతరం భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
భక్తులందరికీ సరిపడా మంచినీరు, యోగా మ్యాట్స్ (Mats) వంటి మౌలిక వసతులను ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నామని,రాష్ట్ర
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరి బాధ్యత అని, ఆలయ పరిపాలనా విభాగం, సెక్యూరిటీ మరియు శానిటేషన్ విభాగానికి చెందిన ప్రతి ఒక్క సిబ్బంది, ఉద్యోగులు ఈ యోగా శిక్షణకు ప్రతి రోజు తప్పనిసరిగా హాజరు కావాలని ఈవో ఆదేశించారు.
ఈ 14 రోజుల యోగా కార్యక్రమం గురించి ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులకు సమాచారం అందించి,అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొనేలా ఏర్పాట్లు చూడాలని ఈవో ఆదేశించారు.
శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని ఈవో శీనా నాయక్ కోరారు.
