జనసేన పార్టీ నుండి రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసిన లింగమనేని రమేష్ .
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు.
అమరావతి, జూన్ 06:- వెలగపూడి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం నందు ఈరోజు జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ లింగమనేని రమేష్ గారిని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన ఎమ్మెల్సీలు శ్రీ కొణిదల నాగబాబు గారిని, శ్రీ పిడుగు హరిప్రసాద్ గారిని, మహాన్యూస్ ఎండీ శ్రీ మారెళ్ళ వంశీ కృష్ణ గారిని, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని రెడ్డి అప్పలనాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ "రాజ్యసభ సభ్యునిగా శ్రీ లింగమనేని రమేష్ గారికి లభించిన ఈ గౌరవం ప్రజాసేవ పట్ల వారి అంకితభావానికి నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం మీరు మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. శ్రీ రమేష్ గారి పదవీకాలం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు..
