స్థానిక ఎన్నికలపై టీడీపీ ఫోకస్ – బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన .
ఎచ్చెర్ల, జూన్ 4:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల మండలం తోటపాలెంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. క్లస్టర్-10 పరిధిలోని ఐదు యూనిట్లకు చెందిన 29 మంది బూత్ స్థాయి నాయకులతో జరిగిన ఈ సమావేశానికి క్లస్టర్ ఇంచార్జి గోరు జగపతి బాబు అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరు, ఓటరు జాబితాల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై నాయకులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ విజయానికి కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి నాయకుడు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించాలంటే ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గ్రామస్థాయిలో మరింత క్రియాశీలకంగా పనిచేస్తామని తెలిపారు. బూత్ కమిటీల బలోపేతం, ఓటర్లతో నిరంతర సంబంధాలు, ఎన్నికల వ్యూహాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త సమిష్టి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, ఎస్.కోట నియోజకవర్గ పరిశీలకులు చౌదరి బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షుడు బి. మల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అన్నేపు భువనేశ్వర్, యూనిట్ ఇంచార్జి బి. కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ గోరు రాజు, పార్టీ నాయకులు రామారావు, గిరిబాబు, చిన్నబాబు, మహిళా నాయకురాలు కుమారి తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
