రిక్షా లు - డస్ట్ బిన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

రిక్షా లు - డస్ట్ బిన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి రిక్షాలు మరియు డస్ట్ బిన్ల పంపిణీ చేయటం జరిగింది.

ఈ సందర్భంగా  శాసనసభ్యులు  మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు.

మన కొమరోలు మండలానికి రిక్షాలు పంపిణీ ద్వారా గ్రీన్ అంబాసిడరెస్  మీరే మీకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరూ 250 గృహాల నుండి చెత్త సేకరించి పరిశుభ్రం గా ఉంచడంలో మీది ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు మరియు గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. 

 రిక్షాలు , డస్ట్ బిన్ల పంపిణీతో చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.*

ఈ కార్యక్రమంలో కొమరోలు మండల అభివృద్ధి అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post