విశాఖ ​రేంజ్ పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక 'పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్' ప్రారంభం.





 విశాఖ ​రేంజ్ పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక 'పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్' ప్రారంభం.

 పాల్గొన్న ఐజీ మరియు రేంజ్ ఎస్పీలు.

  విశాఖపట్నం, జూన్ 29, 2026: విశాఖపట్నం రేంజ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో అత్యాధునిక సాంకేతిక వసతులతో నూతనంగా నిర్మించిన 'పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్' భవనాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఎన్.టి.పి.సి (NTPC) సింహాద్రి సంస్థ తమ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ భవనాన్ని నిర్మించింది. ఈ నూతన కేంద్రాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు, మరియు రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు శ్రీ దామోదర్ (విజయనగరం),

శ్రీ తుహిన్ సిన్హా (అనకాపల్లి), శ్రీ మహేశ్వర్ రెడ్డి (శ్రీకాకుళం) మరియు శ్రీమతి కె.శ్రావణి (మెరైన్) గార్లు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

పోలీస్ సేవల సామర్థ్యాన్ని పెంచే ఆధునిక వేదిక: ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు మాట్లాడుతూ.. రేంజ్ పోలీస్ కార్యాలయంలో మౌలిక వసతుల కల్పన దిశగా ఇది ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సమాజ శ్రేయస్సు, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని, పోలీస్ యంత్రాంగానికి మెరుగైన సాంకేతిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలకు అందించే సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భవన నిర్మాణానికి సి.ఎస్.ఆర్ నిధులు కేటాయించిన ఎన్.టి.పి.సి సింహాద్రి యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.

అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు మాట్లాడుతూ.. ఈ ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ఎన్.టి.పి.సి సింహాద్రి సంస్థ అందించిన తోడ్పాటును కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.

​ఈ కార్యక్రమంలో ఎన్.టి.పి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు హెచ్.ఓ.పీ శ్రీ అయస్కాంత జన మాట్లాడుతూ..* సామాజిక బాధ్యతలో భాగంగా రేంజ్ పోలీస్ కార్యాలయం అభివృద్ధికి మరియు పోలీసు శాఖ ఆధునీకరణకు తమ సంస్థ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు.

​ఈ ఘనమైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్.టి.పి.సి ఉన్నతాధికారులు శ్రీ శ్రీమంత మహాపాత్ర, శ్రీ ప్రకాశరావు, డీఎస్పీలు కిరణ్ కుమార్, రవికుమార్, ఇన్స్పెక్టర్లు మల్లికార్జునరావు, రాము, రామకృష్ణారావు, మన్మధరావు, ఏవో శ్రీమతి నాగలక్ష్మి, మేనేజర్ సూర్యారావు, ఐటీ కోర్ శ్రీధర్, మరియు రేంజ్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post