పోలవరం పోలీస్ స్టేషన్‌లో నాగలక్ష్మికి ఘన సన్మానం - ఎస్సై పి. అప్పారావు.


 పోలవరం పోలీస్ స్టేషన్‌లో నాగలక్ష్మికి ఘన సన్మానం - ఎస్సై పి. అప్పారావు.

పోలవరం, జూన్ 29 క్రైమ్ప్ర 9మీడియా ప్రతినిధి శరత్.

పోలవరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది నాగలక్ష్మి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమం పోలవరం ఎస్సై పి. అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

నాగలక్ష్మిని పూలదండలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

స్టేషన్‌లో అందించిన సేవలను ఎస్సై అప్పారావు కొనియాడారు.

విధి నిర్వహణలో ఆమె చూపిన క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రశంసించారు.

జంగారెడ్డిగూడెంలో కూడా అదే విధంగా సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.

అనంతరం పోలీసు సిబ్బంది నాగలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికను అందజేశారు.

సహచరులతో కలిసి ఆమెకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మురళి, కోటి, ప్రసాద్, స్వామి, బుల్లి రాజు, నరేష్, షాజహాన్, సుజాత, నాగలక్ష్మి, సురేష్, గంగరాజు, సతీష్, రామాంజనేయులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post