సీనియర్ జర్నలిస్ట్ ఇంటిపై దాడి చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి.


 సీనియర్ జర్నలిస్ట్ ఇంటిపై దాడి చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి.

జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారికి వినతి పత్రం అందజేసిన  ఏలూరు ప్రెస్ ఫోరమ్.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్ .

          ఏలూరు జిల్లా  పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలోని సీనియర్ జర్నలిస్ట్ రుషి రావు ఇంటిపై దాడి చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారికి ఈరోజు ది ఏలూరు ప్రెస్ ఫోరమ్ అధ్యక్షులు డివి రమణ, పిఆర్ఓ సంజయ్, గౌరవ అధ్యక్షులు రత్నగర్భ ప్రసాద్,కోశాధికారి హరీష్, ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జబీర్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ పి నారాయణ తదితర సభ్యులు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు కట్టడం జరిగిందని. వెంటనే విచారణ ప్రారంభించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఏలూరు మీడియా ప్రతినిధులు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఇది మంచి పరిణామం అని ఆయన అభినందించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post