జూన్ 30, జులై 1న ఏలూరులో వ్యవసాయం,రైతుల అంశాలపై విద్యార్థులకు పోటీలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జూన్ 21:
జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా జూన్ 30, జులై 1వ తేదీల్లో ఏలూరులోని సాహిత్య మండలిలో విద్యార్థినీ,విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం,సామెతలు,నినాదాలు, ఏకపాత్రాభినయం, కోలాటం,నృత్య ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు మహాసభ ఆహ్వాన సంఘం నాయకులు వెల్లడించారు.
విద్యార్థుల పోటీలకు సంబంధించిన ఫ్లెక్సీలను, కరపత్రాలను ఏలూరు పవర్ పేటలోని ఉద్దారాజు రామం భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం, వివిధ సంఘాల నాయకులు ఆదివారం ఆవిష్కరించారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి.బలరాం మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అందుకు విద్యాలయాల వారు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరం పరిసర ప్రాంతాల హైస్కూల్,కాలేజీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యార్థులు,కవులు.కళాకారులను రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి విషయాలపై అవగాహన పోటీలు కార్యక్రమం తలపెట్టామని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థులకు విద్యాలయాల వారికి విజ్ఞప్తి చేశారు. ఏలూరు చుట్టుపక్కల 70 స్కూల్స్ కాలేజీల్లో సోషల్ మీడియా,కరపత్రాలు, బ్యానర్ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు ప్రచారం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు నగరం పరిసర ప్రాంతాల్లోని విద్యాలయాల వారు ఆరు అంశాలలో విద్యార్థులను పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.. ఆర్టిస్టులు కళాకారులు కూడా ప్రతిభా ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. గత 90 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. దేశానికి తిండి గింజలు అందిస్తున్న వ్యవసాయం నేడు సంక్షోభంలో ఉందని, రైతులు నష్టాల్లో ఉన్నారని ఈ పరిస్థితుల్లో వ్యవసాయరంగ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ ఎం.నాగమణి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

