యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వెయ్యాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం - మంత్రి కొలుసు పార్థసారథి.




 యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వెయ్యాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం - మంత్రి కొలుసు పార్థసారథి.

యోగా ఆసనాలు ఆరోగ్య వంతమైన నవసమాజ నిర్మాణానికి దోహద పడుతుంది.

ప్రతి ఒక్కరూ యోగాకు ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలి.

రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగాంధ్ర-2026 శుభాకాంక్షలు.

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.. సన్నీ.

ఏలూరు/నూజివీడు, జూన్ 21: విజయవాడ తాడిగడప రాష్ట్ర సమాచార శాఖ మంత్రివర్యులు స్వగృహంలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 దినోత్సవ వేడుకలు సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి యోగా ఆసనాలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ యోగాంధ్రతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వెయ్యాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్య వంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, నూజివీడు నియోజకవర్గం ప్రజలకు అంతర్జాతీయ యోగాంధ్ర-2026 శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనం అని, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయ పడుతుందన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, యోగా అభ్యాసనపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. యోగాతో శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని అందరిలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందన్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేసి ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చునని తెలిపారు. యోగాకు భారత ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా విశిష్టమైన స్థానాన్ని ఇస్తున్నారని, దీన్ని బట్టి మనం ఆలోచనలు చేసుకోవాలని అన్నారు. ఈ రోజుల్లో పిల్లలు నుండి పెద్దవారు వరకు అనేక రకములు ఒత్తిడిలకు గురి అవుతున్నారని, దీని నుండి మనం మనల్ని కాపాడుకుని, మన పిల్లలు భవిష్యత్తును ఆలోచన చేసి యోగాను ప్రతిరోజు ఆచరించాలన్నారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని ఇది నిరంతరం ప్రక్రియ అని, మన ఆరోగ్యానికి మనమే అత్యంత బాధ్యత తీసుకోవాలని అన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post