ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టిడిపి నాయకుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి
కొమరోలు : ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకులపై ఉందని గిద్దలూరు నియోజకవర్గ టిడిపి నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. స్థానిక ముత్తుముల సంజీవరెడ్డి నివాస గృహంలో మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల స్థాయి టిడిపి నాయకులు,కార్యకర్తల సమావేశమును బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ టిడిపి నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఇంకా ప్రజల్లోకి చేరటం లేదని వాటిని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పసుపు సైన్యానికి ఉంది అని అన్నారు. ప్రభుత్వము మరియు పార్టీ వేరు కాదని తెలుసుకొని ప్రతి ఒక్క కార్యకర్త మీ పరిధిలోని ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఒకవేళ మీతో కానిపక్షంలో మండల స్థాయి, నియోజకవర్గస్థాయిలోని నాయకులకు తెలియచేయాలని అన్నారు. మన పార్టీ నాయకులే పార్టీ చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని కావున ప్రతి ఒక్కరూ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే భావన పక్కన పెట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే మనకు స్థానికంగా బలం ఉంటుందని రాబోయే ఎన్నికల్లో 14 సర్పంచులు 12 ఎంపీటీసీ స్థానాలను మనం కైవసం చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు. త్వరలో జరిగే సర్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్ను మిస్ కాకుండా పరీక్షించి అర్హత ఉన్న ప్రతి ఓటర్ను చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు,ఏఎంసీ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు తిరుమలరెడ్డి, షేక్ హసీనా, ఎడమాకల్లు సొసైటీ అధ్యక్షుడు బెజ్జం రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు బీజ్జం వెంకట్రామిరెడ్డి, పులకుర్తి వెంకటేశ్వర్లు, అనప వీరశేఖర్,జ్యోతి రెడ్డి, పులకుర్తి సుబ్బరాయుడు, ముత్తుముల ఎల్లారెడ్డి, లక్ష్మీ నరసయ్య, రామస్వామి, బొడ్డు రంగయ్య, గురు స్వామి రెడ్డి, బద్రి లక్ష్మీ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు
