ఆలయాల అభివృద్ధికీ సహకారం అందించాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఏపీ సెక్రటరియేట్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మార్కాపురం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికీ సహకారం అందించాలని, నిర్మాణంలో ఉన్న ప్రాచుర్యం పొందిన ఆలయాల అభివృద్ధికీ సీజీఫ్ ద్వారా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న పూజారులకు దూపదీప నైవేద్యం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.. సానుకూలంగా స్పందించిన మంత్రి వాటిని పరిష్కారం చేస్తామన్నారు.
