గిద్దలూరు లో రైతుల సంఘాల సమాఖ్య సమావేశంలో పిడతల.


 గిద్దలూరు లో రైతుల సంఘాల సమాఖ్య సమావేశంలో పిడతల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘాల సమాఖ్య రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే రెండు సంవత్సరాల వరకు పొగాకు పంటను సాగు చేయకూడదని తీర్మానించారు.

ప్రస్తుతం పొగాకు గిట్టుబాటు ధర లేకపోవడం డిమాండ్ కు మించి రైతులు పొగాకు సాగు చేయడం వంటి అంశాలలో రైతులకు పొగాకు పంట నష్టాలు తెచ్చిపెడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు.

గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్ లో రైతు సంఘాల సమాఖ్య సమావేశం అధ్యక్షుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

రైతుల సంక్షేమం కోసం మాజీ శాసనసభ్యులు రామభూపాల్ రెడ్డి 2001వ సంవత్సరంలో ఈ సమైక్యను స్థాపించడం జరిగిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కలిసికట్టుగా పోరాటం చేద్దామని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అలానే రైతులకు మొక్కజొన్న కంపెనీల నుంచి భరోసా కల్పించే విధంగా పనిచేస్తామని వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఇన్సూరెన్సులు రైతుకు కల్పించే విధంగా ఈ సమాఖ్య పనిచేస్తుందని రైతు సంఘం నాయకులు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post