స్నేహితుల మధ్య ప్రముఖ వైద్యుడు డాక్టర్ కూన పవన్ కుమార్ జన్మదిన వేడుకలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన
స్థానిక ప్రముఖ వైద్యుడు డాక్టర్ కూన పవన్ కుమార్ జన్మదిన వేడుకలను ఆయన స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురికి భోజనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు శంకర్ మాట్లాడుతూ డాక్టర్ కూన పవన్ కుమార్ సమాజ సేవలో ముందుండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

