జగన్నాథ్ సాగర్ గట్టు సుందరీకరణకు శ్రీకారం.. నేడు అభివృద్ధి పనులకు ప్రారంభం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ జగన్నాథ్ సాగర్ గట్టు ఎట్టకేలకు అభివృద్ధి బాట పట్టనుంది. స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష మేరకు జగన్నాథ్ సాగర్ గట్టును ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి జగన్నాథ్ సాగర్ గట్టు పరిసర ప్రాంతాలను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సుందరీకరణ ప్రణాళికలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. జగన్నాథ్ సాగర్ గట్టును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సోమవారం నుంచి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు అడుగులు పడుతుండటంతో పలాస పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

