కండ్రికగూడెంలో “హలో కిడ్స్ లిటిల్ ఎలైట్స్” ప్రీ-స్కూల్ ప్రారంభం
ఏలూరు, జూన్ 24:క్రైమ్ 9 మీడియా సన్నీ చక్రవర్తి
ఏలూరు నగరంలోని కండ్రికగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హలో కిడ్స్ లిటిల్ ఎలైట్స్” ప్రీ-స్కూల్ ను కార్పొరేటర్ తంగిరాల అరుణ బుధవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించే విద్యాసంస్థలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాదాసు పావని పద్మశ్రీ మాట్లాడుతూ, చిన్నారులకు ఉత్తమ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కండ్రికగూడెంలో ఈ ప్రీ-స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక బోధనా పద్ధతులు, ఆటల ద్వారా నేర్చుకునే విధానాలు, పిల్లల మానసిక వికాసానికి అనుగుణమైన ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్‌మెన్ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష మాట్లాడుతూ, చిన్నారుల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి అనుగుణంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త కందులు రమేష్ మాట్లాడుతూ, పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
పాఠశాలలో ఫిజికల్ స్కిల్స్, ఎర్లీ లెర్నింగ్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, గుడ్ మ్యానర్స్, హెల్తీ హ్యాబిట్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఫోటో క్యాప్షన్:






