దిబ్బవానిపేట గ్రామాభివృద్ధికి విజయ్ బ్రదర్స్ చేయూత.
రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 23:
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని దిబ్బవానిపేట గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు విజయ్ బ్రదర్స్ ముందుకొచ్చారు. గ్రామ ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించే లక్ష్యంతో సుమారు రూ.4 లక్షల స్వంత నిధులతో గ్రామంలో గ్రావెల్ రహదారిని నిర్మించారు.
నూతనంగా నిర్మించిన ఈ గ్రావెల్ రోడ్డును పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సేవాభావం కలిగిన వ్యక్తులు కూడా భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి స్వంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టిన విజయ్ బ్రదర్స్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ రహదారి గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో గోవింద్ పాపారావు, బైపిల్లి నారాయణ, రాంబాబు, గణపతి, బాలరాజు, రామారావు, కుమార్, భాస్కరరావు, మారయ్య, విజయరామ్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధి కోసం విజయ్ బ్రదర్స్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

