నువ్వలరేవులో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవం.
కార్యక్రమంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు, జూన్ 23: పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NRGS) నిధులతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, వివిధ ధ్రువపత్రాల జారీ, పరిపాలనా సేవలను ఒకే వేదికపై వేగవంతంగా, పారదర్శకంగా అందించడంలో గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అనంతరం గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, సచివాలయ సిబ్బంది, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

