పుట్టపర్తిలో ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ చైర్మన్ జవహర్ కు ఘన స్వాగతం పలికిన మాజీమంత్రి డాక్టర్,, పల్లె.
పుట్టపర్తి లోని స్థానిక ఎమ్మెల్యే నివాసానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ చైర్మన్ జవహర్ తోపాటు కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి శాలువతో సన్మానించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి.
మాజీ మంత్రి నివాసంలో అల్పాహార విందు చేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రివర్గంలో కొనసాగిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,అప్పటి మంత్రి ప్రస్తుత ఏపీ ఎస్సీ కమిషన్ కమిటీ చైర్మన్ జవహర్ లు కొద్దిసేపు అప్పటి రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలను సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
మీ కోడలు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పనితీరు ఎంతో అద్భుతం.
యువమహిళా ఎమ్మెల్యే పల్లె సింధూర పనితీరుపై ప్రశంసించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్.
పుట్టపర్తి నియోజకవర్గంలో యువ మహిళా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి నియోజవర్గ అభివృద్ధిలోనే కాకుండా ప్రజల్లో మమేకమైన తీరు ఎంతో అద్భుతం అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వద్ద వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ యు ఎమ్మెల్యేను ప్రశంసించారు.
అంతేకాకుండా పుట్టపర్గి నియోజవర్గ సమస్యలపై ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో యువ మహిళా ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం గా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు పైన ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తాను కొంతమంది వ్యక్తులతో మాట్లాడిన తీరని బట్టి తెలుస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పనితీరుపై జవహర్ కొనియాడారు.
ప్రజల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరకు ఎంతో మంచి పేరు ఉందని కితాబ్ ఇచ్చారు. పల్లె సింధూరకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి నియోజకవర్గం లో ఎంత మంచి పేరు ఉందో అంతకంటే ఎక్కువగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి అభివృద్ధిలోను ప్రజల్లోను ,ప్రభుత్వంలోనూ ఎంతో మంచి పేరు పొందారని ఎమ్మెల్యే పల్లె సింధూర కు ఎల్లప్పుడూ మా ఆశీస్సులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ ఆశీస్సులు ఆమెకు ఉంటాయనీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులు రామలక్ష్మి, గంగాధర్, జిల్లా అధికారులు ఆర్డీవో సువర్ణ ,కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
