పూండిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం.




 పూండిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం.

ప్రజల నుంచి విశేష స్పందన.

 క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పూండి, జూన్ 3: పలాస

 శాసనసభ్యురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో పూండి గ్రామంలో మదర్ థెరిస్సా సేవా సంస్థ నిర్వహణలో, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్, శ్రీకాకుళం సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, మదర్ థెరిస్సా సేవా సంస్థ అధ్యక్షుడు పుచ్చ ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి మరియు సేవా సంస్థ ఉపాధ్యక్షుడు కర్ని రమణ ప్రారంభించారు.

పూండి బస్టాండ్ సమీపంలోని డీహెచ్‌ఆర్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించారు.

అదేవిధంగా రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్, 2డీ ఎకో, మెమోగ్రఫీ తదితర వైద్య పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించారు. వైద్య నిపుణులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మదర్ థెరిస్సా సేవా సంస్థ అధ్యక్షుడు పుచ్చ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యక్షుడు కర్ని రమణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పీ4 ప్రతినిధి శ్రీను, కో-ఆప్షన్ సభ్యులు విఘ్నేష్, శంకర్, వేణుగోపాల్, శివ, టీడీపీ సీనియర్ నాయకులు మోహనరావు, నారాయణ, చంద్రయ్య, నిహాల్, కృష్ణార్జున యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

"ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నినాదంతో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post