గోదావరి పుష్కరాలు -2027 ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీచక్రవర్తి.
ఏలూరు, జూన్,2 : ఏలూరు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తెలియజేసారు. గోదావరి పుష్కరాలు -2027 ఏర్పాట్లపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాట్లు, ఘాట్లలో మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి, రవాణా, భద్రత, తదితర ఏర్పాట్లకు సంబంధించి ఏలూరు జిల్లా ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పుష్కర స్నానానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర ఏర్పాట్లకు సంబందించి వివిధ శాఖల నుండి ప్రతిపాదనలు స్వీకరించి, పరిశీలించి వెంటనే పంపాలన్నారు.
