జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలో 1,821 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు సిద్దం..
వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో నీట్ పరీక్ష సజావుగా జరిగేందుకు చర్యలు.. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు.
జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ స్థాయి నీట్ (NEET) పరీక్షను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
నీట్ పరీక్ష సక్రమ నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలసి రెవెన్యూ, బ్యాంకు పోలీస్, పోస్టల్, విద్యా, వైద్య, అగ్నిమాపక, ప్రజా రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఈ నెల 21న జరగనున్న జాతీయ స్థాయి నీట్ యుజి పరీక్షకు జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో 1,821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. మధ్యాహ్నం 02 రెండు గంటల నుంచి సాయంత్రం 05.15 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పీడబ్ల్యూ విద్యార్థులకు 6.20 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు.
పరీక్ష జరిగే ప్రతి కేంద్రంలో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు వంటి చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పరీక్ష నిర్వహణ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల అవసరమైన బందోబస్తు చర్యలు పటిష్టంగా అమలు చేయలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు పోలీస్ శాఖ ద్వారా చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన పూర్తి సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో రవాణా సౌకర్యం కల్పించేలా ప్రజా రవాణా శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల రూటులలో ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. పరీక్షకు హాజరగు విద్యార్ధులకు ఆర్టిసి బస్సులలో ఉచితంగా ప్రయాణించేలా సదుపాయం కల్పించినందున, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్టిసి అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలా విద్యుత్ శాఖకు, వైద్య శిబిరంతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పోస్టల్ శాఖ పరీక్షా పత్రాల రవాణా, భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యాంకుల్లో పరీక్షా పత్రాల భద్రం, ప్రశ్నాపత్రాల స్వీకరణ, స్టోరేజ్, ఉపసంహరణ, పరీక్షా కేంద్రాలకు తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ప్రాథమిక సౌకర్యాల కల్పన, పరీక్షా నిర్వహణ వంటి అంశాలు ప్రతి దశలోను ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో విజయవంతంగా నీటి పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఆర్వో శ్రీమతి మాధురి, ఒంగోలు ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, డీఈవో శ్రీమతి రేణుక , డీఎంహెచ్ఓ డా వెంకటేశ్వర రావు, ఆర్ టి సి ఆర్ ఎం సత్యనారాయణ, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ శ్రీ ఎం. మనీష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

