భావోద్వేగభరిత వాతావరణంలో సాగిన వెలిగొండ రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.



 భావోద్వేగభరిత వాతావరణంలో సాగిన వెలిగొండ రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి వచ్చిన రైతులు.

రైతుల మధ్యనే కూర్చొని ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు... పునరావాసం విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న నిర్వాసితులు.

పునరావాసం విషయంలో నాటి ప్రభుత్వ వేధింపులను సమావేశంలో వివరించిన రైతులు, నిర్వాసితులు*

పునరావాసం అందించే నిమిత్తం రూ.300 కోట్లు ఇవ్వడానికి స్వయంగా సీఎం రావడంపై భావోద్వేగానికి గురైన సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు

తమ బాధలను, తమను గుర్తించి పరిష్కారం చూపింది చంద్రబాబే అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్న ఖాసీం వలీ.

గత పాలకులు పునరావాసం ఇవ్వమంటే అరెస్టులు చేసి వేధించారంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్న నిర్వాసితులు.

తమ హక్కులను కాలరాసే విధంగా తమను బంధించారన్న వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులు.

పునరావాసం డబ్బులు అందుతుండడంతో తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కలిగిందన్న మరో నిర్వాసితుడు హనుమ ప్రసాద్.

వెలిగొండ ప్రాజెక్టు పనులను చకచకా చేపట్టడం ద్వారా తమ 30 ఏళ్ల కలను సాకారం చేస్తున్నారంటూ పాదాభివందనం చేసే ప్రయత్నం చేసిన రైతులు... నివారించిన ముఖ్యమంత్రి.

రైతులు, నిర్వాసితుల మాట్లాడిన అంశాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే గ్యారెంటీ తనది అంటూ నిర్వాసితులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.

నాలగు జిల్లాల తలరాతలు మార్చేందుకు సహకరిస్తోన్న నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలాలు అందిస్తామన్న సీఎం చంద్రబాబు

7,225 మంది నిర్వాసితులు ఉంటే కేవలం 96 మందికే ఆర్ అండ్ ఆర్ నిధులు అందించిన గత ప్రభుత్వం.

శనివారం ఒక్క రోజునే 2351 మంది నిర్వాసితులకు రూ. 300 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ నిధులు అందించిన సీఎం చంద్రబాబు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post