చెట్టును డీకొని ఇద్దరు యువకులు మృతి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జూన్:01. మాడుగుల మండలంలో ఆదివారం అర్ధ రాత్రి జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దాసరి వరుణ్, పెచ్చేటి సాయి కిరణ్ అను వారు బైక్ పైన గాదిరాయి నుండి జంపెన వస్తూ మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి పక్కన ఉన్న చెట్టు ను బలంగా డీ కొట్టడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు అయ్యి అక్కడిక్కడే చనిపోవడం జరిగింది
మృతులను చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మాడుగుల ఎస్సై నారాయణాయరావు తెలిపారు

