ప్రజలు భద్రత ద్యేయంగా ఆధునిక నిఘా వ్యవస్థ బలోపేతం - డీఎస్పి శ్రావణి.


 ప్రజలు భద్రత ద్యేయంగా ఆధునిక నిఘా వ్యవస్థ బలోపేతం - డీఎస్పి శ్రావణి.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూన్:01 చోడవరం పట్నం లో ప్రజల భద్రత మరియు నేర నియంత్రణ చర్యలలో భాగంగా, అన్నవరం పరిసర ప్రాంతంలో చోడవరం పోలీసులు ఆధునిక నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఈ క్రమంలో అన్నవరం ఏరియాలోని ముఖ్య కూడళ్లు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రదేశాలలో మొత్తం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కెమెరాల ద్వారా ప్రాంతంలో జరిగే అనుమానాస్పద కదలికలు, నేర కార్యకలాపాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుంది. నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయడంలో ఈ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (Addl. SP) ఎం.శ్రావణి , చోడవరం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పి. అప్పలరాజు, సీసీ కెమెరా టెక్నీషియన్ తోట శ్రీనివాసరావు పాల్గొని కెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించారు. ప్రజల భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

ప్రజలు కూడా తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ప్రైవేట్ ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించగలమని పోలీసులు తెలిపారు.

చోడవరం పోలీసులు ప్రజల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరిన్ని నిఘా చర్యలను చేపడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post