పాము కాటుకు వ్యక్తి మృతి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జూన్:26
మాడుగుల మండలం
వీరనారాయణం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను అనే వ్యక్తి 40 సం,కృష్ణాపురం గ్రామంలో గల నీరుకొండ ప్రసాదరావు యొక్క పామాయిల్ తోటలో పనికి వెళ్ళి పని చేస్తుండగా ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని పాము కాలు వద్ద కాటు వేయడం వల్ల మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చేలోపు చనిపోయినట్టు డాక్టర్ నిర్ధారించగా మృతుని భార్య అయిన లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై నారాయణరావు తెలిపారు
