గొలుగొండ మండలం దారమట్టం శివాలయం జలపాతం వద్ద యువకుడు మృతి.


 గొలుగొండ మండలం దారమట్టం శివాలయం జలపాతం వద్ద యువకుడు మృతి.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి గోలుగొండ, జూన్:26

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం దారమట్టం శివాలయం సమీపంలోని జలపాతం వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

జలపాతంలో స్నానానికి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post