హిమగిరి గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం.


 హిమగిరి గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 12: 

పలాస మండలం హిమగిరి గ్రామంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై మహిళా భద్రత, నారీ శక్తి, నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే గ్రామంలో జరిగే పండుగలు, ఉత్సవాలు మరియు ఇతర సామూహిక కార్యక్రమాల సమాచారాన్ని ముందస్తుగా పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు విక్రయాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు వివరించారు. బాల్య వివాహాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో 112 సేవల వినియోగం గురించి అవగాహన కల్పించారు.

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ ఆర్. నరసింహమూర్తి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post