స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.



 స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 16: పరిశుభ్రమైన గ్రామాలు, అభివృద్ధి చెందిన రాష్ట్ర నిర్మాణమే స్వర్ణ ఆంధ్ర లక్ష్యమని, ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష పిలుపునిచ్చారు.

పలాస మండలంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార రథాలను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించి జెండా ఊపి పంపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి ప్రజల్లో పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.

పరిశుభ్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆమె సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి–పొడి వ్యర్థాలను వేరు చేసి నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్వర్ణ ఆంధ్ర – 2047 లక్ష్య సాధనలో స్వచ్ఛతకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు.

ఈ అవగాహన రథాల ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post