రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు.
ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశంజిల్లా ఒంగోలులో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు ఈ నెల 18వ తేది ఒంగోలు నగరంలోని ఎస్జివిఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న నేపధ్యంలో, మంగళవారం జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఎస్జివిఎస్ కళ్యాణ మండపాన్ని సందర్శించి, విజయోత్సవ సంబరాల ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించేలా, ఎలాంటి పోరాపాట్లుకు తావివ్వకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు.
జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి మధురి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీమతి వరలక్ష్మి, డ్వామా పిడి శ్రీ జోసఫ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
