నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం.


 నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూన్:26

చోడవరం లో

నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 13.00 గంటలకు చోడవరం సమీపంలోని చీడికాడ రోడ్ జంక్షన్ వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో చోడవరం ఎస్‌హెచ్‌ఓ పి. అప్పలరాజు, ఎస్‌ఐ కె. నాగకార్తీక్ , పోలీస్ స్టేషన్ సిబ్బంది, గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు, చోడవరం ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. అటువంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి, విద్య, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అవగాహన కల్పించారు.

అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించబడింది. తదుపరి చీడికాడ రోడ్ జంక్షన్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం "మాదకద్రవ్య రహిత సమాజం – మనందరి బాధ్యత", "Say No to Drugs" వంటి నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

చోడవరం పోలీస్ స్టేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మాదకద్రవ్యాలకు సంబంధించిన ఏవైనా అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post