ఏలూరులో ఘనంగా బెస్ట్ మనీ గోల్డ్ నూతన బ్రాంచ్ ప్రారంభం.
క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు నగరంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బిఎంజి బెస్ట్ మనీ గోల్డ్ నూతన బ్రాంచ్ శుక్రవారం రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనం చేసి, రిబ్బన్ కట్ చేయడం ద్వారా ఈ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ.. వినియోగదారులకు పారదర్శకమైన, నమ్మకమైన సేవలను అందించడం అభినందనీయమన్నారు. వేగవంతమైన, నాణ్యమైన సేవలతో ఈ సంస్థ ప్రజల విశ్వాసాన్ని చూరగొని మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సంస్థ సీఈఓ సెల్వం మాట్లాడుతూ.. తమ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఎక్కడా దగా, మోసాలకు తావులేకుండా పారదర్శక లావాదేవీలు నిర్వహించడం తమ ప్రత్యేకత అన్నారు. ముఖ్యంగా ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని తామే విడిపించి, అప్పటికప్పుడు అదే రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. వినియోగదారుల వీలును బట్టి సంస్థ ప్రతినిధులే నేరుగా ఇంటి వద్దకే వచ్చి, ఆ రోజు మార్కెట్‌లో ఉన్న గోల్డ్ రేటు ప్రకారమే పూర్తి నగదు అందించి బంగారాన్ని కొనుగోలు చేస్తారని సీఈఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, మేనేజ్మెంట్ ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, స్థానిక వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొని నూతన బ్రాంచ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


