హజరత్‌గూడెం గ్రామ ప్రజలకు అవగాహన తెలియజేస్తున్న ఎస్సై.


 హజరత్‌గూడెం గ్రామ ప్రజలకు అవగాహన తెలియజేస్తున్న ఎస్సై. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం మండలంలోని హజరత్‌గూడెం గ్రామంలో ఎస్‌ఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన ఎస్‌ఐ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS), మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి భద్రతా నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

మహిళలపై జరిగే వేధింపులు, నేరాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కంభం సబ్ ఇన్స్పెక్టర్ శివరామ కృష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post