డీఎస్సీపై జగన్ రెడ్డి ఆరోపణలు అర్ధరహితం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అమలు చేయకుండా నిరుద్యోగుల్ని దగా చేశాడు.
కూటమి హామీ మేరకు డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేస్తే నీచ రాజకీయాలు చేస్తున్నాడు.
యువత, ఉద్యోగులను రోడ్డున పడేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు.
మహానాడు విజయవంతం, అభివృద్ధితో జగన్ కడుపు మండిపోతోందన్న మంత్రి కొల్లు రవీంద్ర.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి, మహానాడు విజయవంతం చూసి ఓర్వలేక జగన్ రెడ్డి డీఎస్సీపై దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి.. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది. సుమారు 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు హైబ్రిడ్ మోడ్‌లో పాల్గొన్నారు. పార్టీ అధినాయకత్వం ప్రకటించిన 21 తీర్మానాలకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక క్రిమినల్ జగన్ రెడ్డి.. మహానాడుపై విమర్శలు చేస్తున్నాడు. రాష్ట్ర ప్రగతి కోసం నాడు అన్న ఎన్టీఆర్ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు దశ దిశ నిర్దేశించేలా మహానాడు నిర్వహిస్తూ వచ్చారు. మహానాడు కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధిని చూసి తట్టుకోలేక మెగా డీఎస్సీ అంటూ దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క డీఎస్సీ కూడా అమలు చేయని జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి డీఎస్సీని అడ్డుకోవడానికి 200కి పైగా కోర్టు కేసులు వేసి ఇబ్బందులకు గురి చేశారు. అయినా వాటన్నింటినీ ఎదుర్కొని డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేశాం. వారంతా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటున్నాడు.
జగన్ రెడ్డి కుంభకోణాలు బయట పడుతున్నప్పుడల్లా.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా రాద్దాంతం చేయడం అలవాటుగా మారిపోయింది. అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపినపుడు మావిగన్ అన్నాడు. ఇప్పుడు జగన్ రెడ్డి పీఏ బాగోతం బయట పడుతుండడంతో డీఎస్సీని బూచిగా చూపుతున్నాడు. జగన్ రెడ్డి పీఏ వందల కోట్లు సంపాదించాడని తేలింది. పీఏ ఆ స్థాయిలో సంపాదించాడంటే.. జగన్ రెడ్డి ఏ స్థాయి అరాచకాలకు పాల్పడ్డాడో ప్రజలు ఆలోచించాలి. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు. వందల కొద్దీ షెల్ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. అవినీతి పార్టీ, దోపిడీ పార్టీ, క్రిమినల్ నైజం ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి చివరికి తల్లిని చెల్లిని ఇంటి నుండి గెంటేశాడు.
మహిళలకు మేము 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేస్తే కనీసం హర్షం వ్యక్తం చేయలేకపోయాడు. తల్లికి చెల్లికి అన్నం పెట్టనోడు రాష్ట్రంలోని మహిళల గురించి ఆలోచిస్తాడనుకోవడం పిచ్చితనం. గతంలో పొగాకు రైతులకు ఇక్కడ అండగా నిలిచాం. ఇప్పుడు కూడా పొగాకు రైతులకు అండగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. తమిళనాడు పడవలు ఏపీ మత్స్యకారుల్ని పెడుతుండడంతో తక్షణమే పరిష్కరించాం. వేట నిషేధ సమయంలో 1.30 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.260 కోట్లు అందించాం. ఒకటోతేదీన పెన్షన్లు అందిస్తున్నాం. తల్లికి వందనం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ లాంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం.
కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తుండడాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నాడన్నారు..
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులతో ఆక్వా కాస్త కష్టకాలం ఎదుర్కొంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తి చేయడం ద్వారా నష్టాలపాలవ్వకుండా చూసుకోగలుతాం. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుతోంది. ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి.
వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. తగిన చర్యలు తీసుకుని ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పొడపాటి తేజశ్విని తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
