ఉత్తరాంధ్రకు చారిత్రక వరం.. విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.

ఉత్తరాంధ్రకు చారిత్రక వరం.. విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి పీవీ కృష్ణరావు 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

కావడంతో అభివృద్ధి యుగానికి శ్రీకారం చుట్టిన . సందర్భంగా మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు పీవీ కృష్ణరావు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్న సాకారమని పేర్కొన్నారు.

విశాఖ ఇప్పటికే ఐటీ హబ్‌గా ఎదుగుతుండగా, రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, రవాణా, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా రైల్వే రంగంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.10,135 కోట్లను కేటాయించడం రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్లు, పోర్టులతో అనుసంధానం బలోపేతం కావడం ద్వారా ఉత్తరాంధ్ర దేశ ఆర్థిక పటంలో కీలక స్థానాన్ని సంపాదించనుందని పేర్కొన్నారు.

విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి యంత్రం" అని పీవీ కృష్ణరావు వ్యాఖ్యానించారు.

ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ లకు కృతజ్ఞతలు తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post