పలాస కిడ్నీ హాస్పిటల్‌లో చోరీ కలకలం.. పేషెంట్ బంగారం, నగదు మాయం.



 పలాస కిడ్నీ హాస్పిటల్‌లో చోరీ కలకలం.. పేషెంట్ బంగారం, నగదు మాయం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 2: 

పలాస పట్టణంలోని కిడ్నీ హాస్పిటల్‌లో చోరీ ఘటన కలకలం రేపింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళా పేషెంట్‌కు చెందిన బంగారు నగలు, నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సమయంలో తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సుమారు రూ.3 వేల నగదు బ్యాగ్‌లో ఉంచినట్లు తెలిపింది. అనంతరం బ్యాగ్‌ను పరిశీలించగా నగలు, నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించింది.

ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రిలో ఆందోళన నెలకొంది. బాధితురాలు వెంటనే ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం అందించగా, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆస్పత్రుల వంటి సున్నితమైన ప్రదేశాల్లో కూడా చోరీలు జరుగుతుండటంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post