పలాస ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.



 పలాస ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

మూడోసారి అధ్యక్షుడిగా సి.హెచ్. నేతాజీ.. రెండో సారి సెక్రటరీగా జయంత్ కుమార్, మొదటి సారి ట్రెజరర్‌గా రమేష్.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 14: 

పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. సంఘ సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో సీనియర్ జర్నలిస్టు సి.హెచ్. నేతాజీ మూడోసారి అధ్యక్షుడిగా, సంపతిరావు జయంత్ కుమార్ రెండోసారి సెక్రటరీగా, రత్నాల రమేష్ తొలిసారి ట్రెజరర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సి.హెచ్. నేతాజీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పలాస ప్రాంత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, బీమా సదుపాయాలు, అక్రిడిటేషన్ సమస్యల పరిష్కారం, నివాస స్థలాల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే యువ జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారి వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని తెలిపారు.

సెక్రటరీగా ఎన్నికైన సంపతిరావు జయంత్ కుమార్ మాట్లాడుతూ సంఘ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించి, జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

ట్రెజరర్‌గా ఎన్నికైన రత్నాల రమేష్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహిస్తూ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను జర్నలిస్టులు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. సి.హెచ్. నేతాజీ నాయకత్వంలో పలాస ప్రెస్ క్లబ్ మరింత అభివృద్ధి చెందాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సంఘం కీలక పాత్ర పోషించాలని సభ్యులు ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post