రద్దు అయిన ఇంటి పట్టాకు అమ్ము కోవ డానికి విఆర్వో ధ్రువ పత్రం మంజూరు.
ఓ కాలి ఇంటి స్థలం 11 సంవ త్సరాల తర్వాత ముగ్గురికి అమ్మకం.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జూన్:15
దేవరాపల్లి, రద్దు అయిన పట్టాకు అమ్ము కోవడానికి విఆర్వో ద్రువ పత్రం మంజూరు, చేస్తె అ ఇంటి స్థలాన్ని 11సంవత్సరాలు తరువాత ముగ్గురుకి షాపింగ్ కాంప్లెక్స్ కు అమ్మకాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని దీని వెనుక ఉండి అమ్మకాలు చేపట్టిన అధిపతి ఎవరో! దీని పై దర్యాప్తు జరిపించి తక్షణ మే చర్యలు తీసు కోవాలని,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం పీజిఆర్ఎస్ తహశీల్దార్ కు ఎంపిడివో లకు పిర్యాదు చేసిన అనంతరం,వీలేకర్లుతో,మాట్లాడారు,దేవరాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2012 లో సర్వే నెంబరు 259/2 లో గ్రామ కంఠం లో 11 మంది భర్తలు చని పోయిన వితంతులకు అప్పట్లో ప్రభుత్వ పట్టాలు మంజూరు చేశారని తెలిపారు నిజానికి పట్టాలు ఇచ్చిన వారందరు సకాలంలో ఇంటి నిర్మాణం చేసుకోనందున 11మంది పట్టాలు రద్దు అయ్యాయని తెలిపారు దీంతో ప్రభుత్వం వారు ఈ స్థలం ను స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీ సచివాలయం 2 నిర్మాణం చేసి మిగిలిన స్థలం ను ఖాళీగా ఉంచి ప్రభుత్వం అవ సారాలకు వాడు కుంటున్నారని అన్నారు 11 మంది పట్టాదారుల్లో ఒక్కరైన గోర్లే దేవుడమ్మ W/o స్వామి నాయుడు మాత్రమే 2012 లో ఇచ్చిన కాలి స్థలంను 2023 లో 11 సంవరాలు తరువాత ముగ్గురు వ్యక్తులకు అమ్మకాలు చేసె సారని పేర్కొన్నారు ఈ అమ్మకాలు చేయడానికి అప్పటి వి ఆర్ ఓ నూకరాజు పట్టా దారునికి ద్రువ పత్రం మంజూరు చేసి అమ్మకాలు చేసు కోవటానికి సహకరించారని వివరంచారు, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు,2012 లో 11 మందికి పట్టాల మంజూరు చేస్తే 6 నేలల్లో ఇల్లు నిర్మాణం చేయ నందున ప్రభుత్వం వారు అస్థలం స్వాధీనం చేసుకుని సచివాల యం నిర్మాణం చేసారని తెలిపారు కొనుగోలు చేసిన వ్యక్తులకు గ్రామ పంచాయతీ అధి కారులు ఏ విధంగా పంచాయతీ అనుమతులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు? అన్ని ఆధారా లున్నా పంచాయతీ అధికారులు అనుమతులు (ఎప్రోవోలు) మంజూరు చేయడం లేదని, అటు వంటిది గ్రామ కంఠంకు 11 సంవత్సరాలు క్రితం రద్దు అయిన పట్టాకు మామ్ముళ్ళుకు కక్కుర్తి పడి అమ్మకాలు చేసు కోవటానికి విఆర్వో ద్రువపత్రం మంజూరు చేస్తే దానికి తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్రుష్టించి దానికి పంచాయతీ అనుమతి ఇవ్వడానకి సిద్ద పడుతున్నారని తెలిపారు,దీని పై వెంటనే ఉన్నత అధికారులు స్పందించి సమగ్రమైన దర్యాప్తు జరిపించి రద్దు అయిన గ్రామ కంఠం భూమికి అమ్మకాలు కొనుగోలు చేసుకోవ డానికి తప్పుడు ద్రువ పత్రం మంజూరు చేసి రద్దు చేయ బడిన పట్టాకు అమ్మకాలు కోనుగోలుకు సహకారం అందించిన విఆర్ఓ పై చర్యలు తీసు కోవాలని ఈ తప్పుడు డాక్యు మెంట్లుకు పంచాయతీ అను మతులు (ఎప్రోవోలు) మంజూరు చేసిన పంచాయతీ అధికారుల పైన చట్ట పర మైన చర్యలు తీసుకుని పంచాయతీ ఎప్రోవులు రద్దు చేయాలని స్తాలానికి వెంటనే బోర్డు ఎర్పాటు చేయాలని లక్ష లాది రూపాయలు విలువ చేసె గ్రాకంఠం భూమిని రక్షించాలని వెంకన్న పిర్యాదులో కోరారు.

