చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ. 3 తులాల బంగారు తాడు స్వాధీనం.


 చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ. 3 తులాల బంగారు తాడు స్వాధీనం.

 క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జూన్:15

మునగపాక జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, పరవాడ డీఎస్పీ బి.మోహన రావు పర్యవేక్షణలో, ఎలమంచిలి సీఐ ధనుంజయరావు ఆధ్వర్యంలో మునగపాక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ఒక చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

జూన్ 11 తేదీన కొండకర్ల గ్రామానికి చెందిన పప్పల సత్యవతి అనే మహిళ అనకాపల్లి నుండి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో మునగపాక మండలం గంగాదేవిపేట సమీపంలోని సత్తమ్మతల్లి పుట్ట గుడి వద్దకు రాగానే, ఆటో డ్రైవర్ మరియు అతని సహచరుడు కలిసి ఆటోను మట్టి రోడ్డులోకి మళ్లించారు. బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసి, ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మునగపాక పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.103/2026 U/s 307 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తించి 

కేసును సవాలుగా తీసుకున్న మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు మరియు వారి సిబ్బంది ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు నేరానికి ఉపయోగించిన ఆటో నంబర్ AP39WC2278 గా గుర్తించి, వారి కదలికలపై నిఘా పెట్టారు విశ్వసనీయ సమాచారం మేరకు, తేదీ.14తేదీన అనకాపల్లి బైపాస్ రోడ్డులోని బస్ స్టాప్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తామే ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు.పెరవల్ల స్వామి రాజమహేంద్రవరం ప్రాంతం.

ఏడిద అప్పారావు రాజవరం గ్రామం, పాయకరావుపేట మండలం, అనకాపల్లి జిల్లా.

స్వాధీనం చేసుకున్న సొత్తు 

సుమారు 3 తులాల బంగారు తాడునేరానికి ఉపయోగించిన ఆటో (నెం. AP39WC2278)

రెండు మొబైల్ ఫోన్లు

పోలీస్ సిబ్బందికి అభినందనలు 

ఘటన జరిగిన 3 రోజుల్లోనే కేసును ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేసిన మునగపాక ఎస్‌ఐ సతీష్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post