మ్రాధిక దృవ్యాలు పట్ల విద్యార్థులుకు అవగాహన సధస్సు - సీఐ అప్పలరాజు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జూన్:13
చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో చోడవరం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 100 రోజుల యాంటీ-డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్బంగా విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై చట్టపరమైన చర్యలు గురించి అవగాహన కల్పించబడింది.
అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోకూడదని సూచించారు.
అలాగే మహిళలపై జరిగే నేరాలు (Crimes Against Women) మరియు వాటికి సంబంధించిన చట్టాలు, మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, అత్యవసర సేవల వినియోగంపై విద్యార్థులకు వివరించారు.రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం కోసం డయల్ 112 నెంబర్ ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై బి. జోగారావు మరియు చోడవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
