పలాసలో 16 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
రూ. 6.33 లక్షల ఆర్థిక సాయం అందజేత.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 13:
ఆపద సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు.
వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం రూ. 6,33,995 విలువైన ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయం అందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు.

