సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలి: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలి: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, జూన్ :18

జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం, ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటమే ధ్యేయంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమైన సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల మేనేజర్లు మరియు ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బ్యాంక్ అధికారులను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు.* 

*సమావేశంలోని ముఖ్యమైన అంశాలు:* 

*తక్షణమే నగదు ఫ్రీజింగ్:* సైబర్ నేరగాళ్ల బారిన పడి బాధితులు కోల్పోయిన నగదును లీగల్ ప్రాసెస్ ద్వారా తక్షణమే ఫ్రీజ్ చేయడంలో, బాధితులకు నగదును విడుదల చేయడంలో బ్యాంకులు చొరవ చూపాలి. నేరంతో సంబంధంలేని ఎకౌంట్లోను డీఫ్రీజ్ చేయాలి. బాధితులకు వారి సొమ్ము తిరిగి అందేలా పోలీస్ శాఖ - బ్యాంకుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలి.

*ఏటీఎంల భద్రత - సెక్యూరిటీ గార్డులు:* జిల్లాలోని అన్ని బ్యాంక్ మరియు ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

*సీసీటీవీ కెమెరాల నిఘా:* బ్యాంకులు మరియు ఏటీఎం పరిసరాల్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను సెంట్రలైజ్ చేయాలి, అవి నిరంతరం పనిచేసేలా (వర్కింగ్ కండిషన్‌లో) చూసుకోవాలి.

*అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై నిఘా:* బ్యాంక్ ఖాతాల్లో జరిగే అనుమానాస్పద నగదు బదిలీలు మరియు సైబర్ నేరగాళ్లు వాడే మ్యూల్ అకౌంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అసాధారణ లావాదేవీలు గమనించిన వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలి.

*ప్రజల్లో అవగాహన:* సైబర్ మోసాలపై ఖాతాదారులకు, ప్రజలకు బ్యాంకుల ద్వారా విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

​"సైబర్ క్రైమ్ బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడంలో బ్యాంక్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. సాంకేతికతను వాడుకుంటూ బ్యాంకులు, పోలీస్ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసినప్పుడే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలం. తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్ (జిల్లా ఎస్పీ, అనకాపల్లి)

​ఈ అత్యవసర సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, అనకాపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ ఎం.శ్రావణి, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, సోషల్ మీడియా/సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఐ.టీ కోర్ ఎస్సై సురేష్ బాబు మరియు జిల్లా పరిధిలోని వివిధ జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల మేనేజర్లు, ముఖ్య ప్రతినిధులు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post