గంజాయి కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష: కోర్టు తీర్పు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి కె.కోటపాడు జూన్:18
అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో (Cr.No. 65/2024, NSC No. 334/2025) గౌరవ IX అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి శ్రీ ఎం.హరి నారాయణ (చోడవరం) ఈరోజు (18.06.2026) కీలక తీర్పు వెలువరించారు.
*కేసు వివరాలు & శిక్షా కాలం:* *నిందితుడు (A1): కార్తీక్ (26),* తండ్రి: సుందరమూర్తి, వృత్తి: క్లీనర్, ఈరోడ్ గ్రామం/జిల్లా, తమిళనాడు.
నేరం: నిందితుడి వద్ద నుంచి గతంలో 04 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కోర్టులో నిందితుడు తనపై మోపబడిన అభియోగాలను స్వచ్ఛందంగా అంగీకరించాడు.
శిక్ష:NDPS Act సెక్షన్ 20(b)(ii)(B) r/w 8(c) కింద నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ, 02 (రెండు) సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,000/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక వారం సాధారణ శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.
రిమాండ్ కాలం సెట్-ఆఫ్ నిందితుడు 27.03. నుండి 18.వరకు రిమాండ్‌లో గడిపిన కాలాన్ని Cr.P.C. సెక్షన్ 428 ప్రకారం శిక్షా కాలంలో మినహాయించనున్నారు ఈ కేసులోని రెండవ నిందితుడు మువ్వల శ్రీను పై విచారణ ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది
ఈ కేసును కె.కోటపాడు ఎస్సై రాజన ధనుంజయ్ అత్యంత సమగ్రంగా దర్యాప్తు చేసి, కోర్టులో పక్కా సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యప్రకాశరావు బలమైన వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు.
*జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS హెచ్చరిక/విజ్ఞప్తి:*
"మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేసే ఒక సామాజిక రుగ్మత. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడే వారిపై అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. యువత వీటికి దూరంగా ఉండాలి. జిల్లాలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి, సమాజ రక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు
