చిన్ననాటి బడిలో రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ సందడి.


 చిన్ననాటి బడిలో రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ సందడి.

విజయనగరం 

రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తాను విద్యాభ్యాసం చేసిన గుడిలోవలోని విజ్ఞాన విహార పాఠశాలను ఈరోజు సందర్శించారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న ఆయన.. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట తనతో పాటే చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు బత్తి అప్పలనాయుడు కూడా ఉన్నారు. వీరిరువురూ కలిసి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆత్మీయంగా గడిపారు. ఆనాడు పాఠశాలలో తాను నేర్చుకున్న క్రమశిక్షణ, విద్యాబోధనే నేడు తనను ఈ ఉన్నత స్థాయికి తీసుకువచ్చాయని విజయ్ సగర్వంగా చెప్పారు. అప్పట్లో తన ప్రిన్సిపాల్‌గా ఉన్న డి.రామకృష్ణ గారు ప్రస్తుతం పాఠశాల డైరెక్టర్‌గా ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ నేర్చుకునే క్రమశిక్షణ జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని పదో తరగతి విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గురువులు, సిబ్బంది అయిన ఫిజిక్స్ ప్రొఫెసర్ గంటి రామకృష్ణ, హాస్టల్ ఇంచార్జ్ సతీష్, పీటీ శ్రీనివాస్, నాన్ టీచింగ్ స్టాఫ్ జనార్దన్ మరియు ఆఫీస్ స్టాఫ్ సూరిబాబు, రామకృష్ణ, సురేష్‌లను కూడా ఆప్యాయంగా పలకరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post