జగన్నాథ్ సాగర్ సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.



 జగన్నాథ్ సాగర్ సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 24: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథ్ సాగర్ సుందరీకరణ పనులను పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష బుధవారం పరిశీలించారు. కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న జంగిల్ క్లియరెన్స్‌తో పాటు ఇతర అభివృద్ధి పనుల పురోగతిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జరుగుతున్న పనుల నాణ్యత, అమలు తీరు, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, సుందరీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జగన్నాథ్ సాగర్‌ను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పట్టణ సౌందర్యాన్ని పెంపొందించడం, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, సుందరీకరణ పనులు పూర్తయిన అనంతరం జగన్నాథ్ సాగర్ పలాస-కాశీబుగ్గ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post