మందస మండలం హరిపురంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ.


 మందస మండలం హరిపురంలో రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ.

ఖరీఫ్ సీజన్‌కు రైతులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

మందస, జూన్ 4:  

రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష పేర్కొన్నారు. మందస మండలం హరిపురం సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రైతులు ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని, పంటల దిగుబడులు పెంచుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. రైతులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post