టిడ్కో స్థలదాత రైతులకు రూ.1.15 కోట్ల నష్టపరిహారం చెక్కుల పంపిణీ.


టిడ్కో స్థలదాత రైతులకు రూ.1.15 కోట్ల నష్టపరిహారం చెక్కుల పంపిణీ.
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్. 

పలాస, జూన్ 4: 
పేదల సొంతింటి కల సాకారం చేసే టిడ్కో గృహ నిర్మాణ కార్యక్రమంలో భూములు అందించిన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష అన్నారు. పలాస ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో టిడ్కో గృహాల నిర్మాణానికి భూములు ఇచ్చిన 9 మంది రైతులకు రూ.1,15,86,973 నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాల కోసం భూములు అందించిన రైతుల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. రైతులకు రావాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతుల హక్కులను పరిరక్షిస్తూ, వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.

టిడ్కో గృహాల నిర్మాణం ద్వారా వేలాది పేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో రైతుల సహకారం కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నష్టపరిహారం చెక్కులు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, టిడ్కో అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు లబ్ధిదారులైన రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post