పలాస 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.
లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో సోమవారం "ఎన్టీఆర్ భరోసా" సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు.
పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులు, స్థానిక సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తోందని తెలిపారు. వృద్ధాప్య, వికలాంగ పింఛన్లను పెంచడం ద్వారా పేదల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ముంగిటకే సంక్షేమ ఫలాలు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

