అత్త హత్య కేసులో నిందితురాలి అరెస్టు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి మే:30
చోడవరం మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో అత్తా కోడలు గొడవ పడిన సంఘటనలో అత్త మృతి చెందిందని, కోడలు నాగమణిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అడిడిషనల్ ఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. శుక్రవారం ఏ ఎస్పీ శ్రావణి చోడవరం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..... వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాసాలమ్మ, కోడలు నాగమణి తరచూ గొడవపడే వారిని, మనవుడు ని పాసాలమ్మ తిట్టడంతో నాగమణి వంటకు వాడే కర్రతో అత్తను తలపై కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కోడలు నాగమణిని అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐ పి. అప్పలరాజు, ఎస్ఐ బి.నాగ కార్తీక్ పాల్గొన్నారు.
